Monday, November 25, 2024

టోక్యోలో భారత అథ్లెట్ల సందడి..

- Advertisement -
- Advertisement -

The buzz of Indian athletes in Tokyo

 

టోక్యో: ఒలింపిక్స్ కోసం ఇప్పటికే టోక్యో చేరుకున్న భారత అథ్లెట్లు అక్కడ సందడి చేస్తున్నారు. భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు ఒలింపిక్ క్రీడా గ్రామం పరిసరాల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇదే సమయంలో క్రీడా గ్రామంలోని ఏర్పాట్లను తిలకించారు. అంతేగాక ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను చుట్టి వచ్చారు. ఇక భారత హాకీ జట్టు తన తొలి మ్యాచ్‌ను శనివారం ఆడనుంది. బుధవారం నుంచి హాకీ జట్టు సాధనను ప్రారంభించనుంది. ఇక మహిళా హాకీ జట్టు మంగళవారమే సాధనను ఆరంభించింది.

ప్రధాన స్టేడియం వద్ద మహిళా జట్టు సభ్యులు ఫొటోలు దిగారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు షూటింగ్, రెజ్లింగ్, సెయిలింగ్, ఆర్చరీ ఆటగాళ్లు కూడా ఒలింపిక్ గ్రామంలో కలియతిరుగుతున్నారు. స్పోర్ట్ విలేజ్‌లో ఏర్పాట్లపై భారత క్రీడాకారులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్టేడియాలను చూసి ఆనంద పడిపోతున్నారు. మరోవైపు కొంతమంది క్రీడాకారులు తమకు కేటాయించిన క్రీడా ప్రాంగణాల్లో సాధన ఆరంభించారు.

ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టిటి క్రీడాకారులు ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇక విశ్వ క్రీడలకు బుధవారం తెరలేవనుంది. కరోనా భయం నేపథ్యంలో ఈసారి ఒలింపిక్స్‌ను కఠిన ఆంక్షల మధ్య నిర్వహిస్తున్నారు. అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరుగనున్నాయి. ఇదిలావుండగా జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్ నిర్వాహక కమిటీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్రీడా గ్రామంలో రోజు రోజుకు కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో నిర్వాహకుల్లో, ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News