నేటి గజ్వేల్ సభతో ముగియనున్న సిఎం కెసిఆర్ ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 15వ తేదీ నుంచి ప్ర చారంలో దూసుకపోతున్న రేసు గుర్రాల మైక్‌లు మోగబోనున్నా యి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని ఊరువాడ అదిరేలా ప్రచారం చే పట్టి ఓటర్లకు దండాలు పెట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. ఈసారి విజయానికి సహకరించాలని కోరుతూ నియోజకవర్గాలు చుట్టేశారు. రామక్క పాటతో ఉదయం ఇంటి బయటకు అ డుగు పెట్టిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. బహిరంగ ప్రచారం మంగళవారం 5 గంటలకు ముగిస్తుండటంతో సైలెంట్ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 2298 మంది పోటీ చేసి విజయం సా ధించేందుకు శక్తియుక్తులు ప్ర యోగించి ప్రజలను మద్దతు కోరారు. మరోవైపు సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయనతో పాటు స్టార్ క్యాంపెయిన్లు కెటిఆర్, హరీశ్‌రావు బ హిరంగ సభలు, పలు సంఘాలతో ముఖాముఖితో పాటు రోడ్‌షోలు నిర్వహించి మూడోసారి బిఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలని కోరారు.
నేటి గజ్వేల్ సభతో సిఎం కెసిఆర్ బహిరంగసభలు ముగిస్తాయి. చేసిన ప్రచారం ఒక ఎత్తు ఉండగా మంగళవారం రాత్రి నుంచి చేసే ప్రచారం మరో ఎత్తు. నగదు, మద్యం, నజరానాల పంపిణీకి బరిలో నిలిచిన అభ్యర్థులు సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. ఈరెండు రోజుల ప్రచారమే తమ గెలుపు ఓటములు నిర్ణయిస్తాయని భావిస్తూ బూత్ స్దాయి ఇంచార్జీల సహాయంతో ఓటర్లకు కావాల్సినవి అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే తమ బంధువుల వద్ద నగదు భద్ర పరచగా, మద్యం సీసాలు, చీరలు, వంట సామాగ్రివస్తువులు అనుచరుల వద్ద ఉంచి బుధవారం పంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ఐదు గంటల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరిగి నగదు పంపిణీ చేసి ఓట్లు గంపగుత్తగా పడే విధంగా ఎత్తులు వేస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.