Sunday, January 12, 2025

మద్యం మత్తులో డ్రైవింగ్.. బైక్ ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బంజారా హిల్స్ రోడ్ నెం. 2 లోని క్రీమ్ స్టోన్ స్టార్ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టిన ఘటన చోటేచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ప్రమాద సమయంలో కారులో యాబై గ్రాముల గంజాయి, గంజాయి నింపిన సిగరెట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కారు నడిపిస్తున్న యువకుడు ముదిగొండ అనుష్ రావు( 23) అని గుర్తించిన పోలీసులు. కారులో మరో యువకుడు పవన్ కళ్యాణ్ రెడ్డీ కూడా ఉన్నారు.

బిబిఎ చదివి ఖాళీగా ఉన్న అనూష్ రావు. గత రాత్రి శంషాబాద్ లోని జీ ఎం అర్ ఎరినా లో సన్ బర్న్ ఈవెంట్ లో మద్యం సేవించడం తో పాటు గంజాయి సేవించినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజ్మత్ అనే యువకుడి పరిస్తితి విషమం. డ్రగ్స్ లేదా గంజాయి సేవించి ఉండొచ్చని నిందితుల మీద అనుమానాలు. రక్త నమూనాలు.. వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిన జూబ్లీ హిల్స్ పోలీసులు. ఎన్ డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News