Friday, December 20, 2024

ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాలు నిలిచిపోయిన సీసీటీవీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్‌సీపీ(ఎస్‌పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.

బారామతి నియోజకవర్గంలో సుప్రియా సూలేపై ఆమె కజిన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునీతా పవార్ పోటీ చేస్తున్నారు. సుప్రియ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల ప్రతినిధులను, అధికారులను, జిల్లా యంత్రాగాన్ని సంప్రదించినా సంతృప్తికరమైన జవాబు రాలేదని, ఈవీఎంలు ఉంచిన ప్రాంతంలో టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరని ఆమె తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News