Thursday, January 23, 2025

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

రాయికల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని నిధులను అందించకుండా ఇబ్బంది పెడుతుందని కరీంనగర్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో అభివృద్ధికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమేనన్నారు.

అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అందుకే మనకు ఎన్నో అవార్డులు వస్తున్నాయని తెలిపారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల రూ.12వందలుగా ఉందన్నారు. పెట్రోలు నాడు రూ.60 ఉంటే నేడు రూ110కి చేరిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయిన నేడు రాష్ట్రానికి రావాల్సిన నిధులను అందించకుండా పోయిన సిఎం కెసిఆర్ ఇక్కడ జరిగే అభివృద్ధిని అపడం లేదని చెప్పారు.

పల్లెల అభివృద్ధికి పల్లె ప్రగతి, పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ప్రజలకు మేలైన వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అభివృద్ధి ఫలాల వల్లనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ అవార్డుల పంట పండుతుందన్నారు. కరోన సమయంలోనూ సంక్షేమ పథకాలను అపకుండా నిదులు విడుదల చేసిన కెసిఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలకుప్రజల దగ్గరకు వచ్చి ఓట్లడిగే ధైర్యం లేదని, ఓటు కోసం వచ్చే ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెప్పాలన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చేపట్టిన అభివృద్ధి చూసి ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేకు ఉన్న నిబద్దత కనబడుతుందన్నారు. రాయికల్ పరిధిలోని రూ.2కోట్లతో రజకుల దోభిఘాట్ నిర్మించడం అభినందనీయమన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు సంబరాలు ఎందుకని ప్రశ్నించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాయికల మేజర్ పంచాయతీని మున్సిపల్‌గా మార్చి రూ.25కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే సంబరాలు చేసుకోవద్దా? అని ప్రశ్నించారు.

రాయికల్‌కు స్వంత మార్కెట్ యార్డు ఏర్పాటు చేసామని, ప్రభుత్వం ఆస్పత్రిలో ఒకప్పుడు ఒక్కరే వైద్యుడు ఉండేవారని అలాంటిది నేడు ఆరుగురు వైద్యులు ఉన్నారని ఎందుకు సంబరాలు చేసుకోకూడదో? ప్రతిపక్షాలు చెప్పలన్నారు. అనేక వార్డుల్లో సిసిరోడ్లు ఏర్పాటు చేసామని, రాయికల్ పట్టణంలో 616 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం అందించామన్నారు. రైతుబంధు ద్వారా 1817 మంది రైతులకు రూ.3.10కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

రైతు భీమా ద్వారా 17 మంది రైతు కుటుంబాలకు చేయూత ఇచ్చామన్నారు. 37వందల మందికి ఆసరా పెన్షన్‌లు అందిస్తున్నామని వివరించారు. 1742 మంది బీడికార్మికులకు జీవభృతి ఇస్తున్నట్లు చెప్పారు. చెరువులు, కుంటలను బాగు చేసామని, చెక్‌డ్యాంలు నిర్మాణం చేసామని ఇంత అభివృద్ధిని చేసామని కళ్లుండి చూడలేని కబోదిలు ప్రతిపక్షా పార్టీలని అసంతృప్తి వ్యక్తం చేసారు.

మాదిగకుంటను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే అడ్డుకున్నారని, సమృకృత మార్కెట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి పని చేస్తామంటే పనులు ఆపివేసారని అ భివృద్ధి పట్టని బిజెపి, కాంగ్రెస్ పార్టీల శ్రేణులపై ఎమ్మెల్యే పరోక్షంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమానికి వినూత్న పథకాలతో పనులు చేస్తున్నారని ప్రజలు మరోసారి ఆదరించి ఆశీర్వాదించాలని కోరారు.

అంతకుముందు గుడికోట ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి రూ.కోటి వ్యయంతో నిర్మించతలపెట్టిన హిందు కమ్యూనిటీ ఒపన్ షెడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశా రు. పలు వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మున్పిపల్ చైర్మన్ మోర మన్మండ్లు, వైస్ చైర్‌సర్శన్ గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్‌కుమార్, కౌన్సిలర్లు కన్నాక మహేంధర్, మారంపెల్లి సాయికుమార్, తురగ శ్రీధర్‌రెడ్డి, వల్లకొండ మహేశ్, అన్వారి బేగం, మ్యాకల కాంతారావు, శ్రీరాముల సువర్ణ, కో అప్షన్ సభ్యులు మహేంధర్బాబు, వనిత, సోహైల్, సింగిల్‌విండో చైర్మన ఏనుగు మల్లారెడ్డి, నాయకులు ఎలిగేటి అనిల్, రామ్మూర్తి, హుస్సెన్, చంద్రతేజ, ప్రసాద్, దశరథం, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ది పనుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కౌన్సిలర్‌లు, సఫయి కార్మికులకు శాలువ, పూలమాలతో సత్కరించారు. 19 మెప్మ స్వయం సహయక సంఘాలకు రూ.1కోటి 70లక్షల చెక్కును అందజేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News