ముషీరాబాద్ ః కేంద్రంలోని మోడి సర్కార్ మహిళలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షు రాలు సుధా సుందర్ రామన్ విమర్శించారు. మహిళా మల్ల యోధుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారించి తీవ్రంగా అవమానపర్చడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. బాగ్‌లింగంపల్లి ఐద్వా కార్యాలయం లో మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా సుందర్ రామన్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల మోడీ పాలనలో మహిళలకు ఏం చేశారో నిర్థిష్టంగా చెప్పాలని ప్రశ్నించారు.
నిత్యావసర వస్తువుల ధరలను పేదలకు అందనంత ఎత్తుకు పెంచిన ఘన త మోడీ ప్రభుత్వానిది కాదా అంటూ నిలదీశారు. గ్యాస్ ధరను రూ.400 లనుంచి రూ. 1200లకు పెంచిన మాట నిజం కాదా అని అన్నా రు. మహిళా మల్ల యోధుల ఆక్రంధనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఈ విషయంలో బిజేపి ఎంపి బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండకు బిజేపి విభజన రాజకీయాలే కారణమని స్పష్టం చేశారు. దేశంలోని యువతులు, విద్యార్థీనీలకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకూ ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలు హైదరా బాద్‌లో జరుగుతాయని తెలిపారు.
మల్లు లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల జాగా ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 లక్షలు ఇవ్వాలన్నారు. పేదలకు ప్రభు త్వం వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ దీక్షలు చేపడుతున్నట్టు, మూడో తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐద్వా ఉపాధ్యక్షు రాలు కేఎన్ ఆశాలత, వినోద తదితరులు పాల్గొన్నారు.