Thursday, December 19, 2024

టిజిపై రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్
మనతెలంగాణ/హైదరాబాద్:  టిజిపై నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానున్నట్టుగా తెలిసింది. ఇప్పటివరకు వాహనాలపై టిఎస్ అని ఉండగా రానున్న రోజుల్లో అది టిజిగా మారనుంది. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకే ఈ కోడ్ మారనుంది. ప్రస్తుతం ‘టిఎస్’ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక ‘టిజి’గా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆర్‌టిఓ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్రం రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం కొత్త కోడ్ టిజితో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News