Thursday, December 26, 2024

దేశంలో విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తుందని కేంద్ర పాడి, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో జాతీయ గిరిజ న మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, గురుకుల పాఠశాలల భవన నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యతతో దేశం అభివృద్ధి ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్తంగా 700 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 23 పాఠశాలలను కేటాయించి కా గజ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

గిరిజన విద్యార్థుల కొరకు సిబిఎస్‌ఈ సిలబస్‌తో 250 మంది వి ద్యార్థులతో గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సుమారు 32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొద టి విడత, రెండవ విడతలలో భవన నిర్మాణాల కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

మొదటి విడత భవనాలను రాష్ట్ర పతి ద్రౌపతిముర్ము వర్చువల్ విధానం ద్వారా 2022 డిసెంబర్ 8 వ తేదిన ప్రారంభించడం జరిగిందని, కంఏద్ర ప్రభుత్వం దేశం లో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాయిలు, అర్‌సిఓ గంగాధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News