Tuesday, December 31, 2024

బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

హత్నూర: హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు ఇబ్రహీం ఇటీవల మృతి చెందడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి ఇబ్రహీం మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. వారి వెంట ఎంపిపి నర్సింలు, దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షుడు అజ్మత్ అలీ, వార్డు సభ్యుడు కొన్యాల సతీష్, నాయకులు ఇబ్రహీం, ఆరిఫ్, కుటుంబ సభ్యులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News