ఇది కాంగ్రెస్ సంస్కృతీ కాదు: కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతీ కాంగ్రెస్‌లో లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో అనేక మంది సిఎం అభ్యర్థులు ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జైరాం రమేష్ ఈ విధంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే సిఎం అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తే ప్రస్తుతం దాని లోపలే ఐటీ కంపెనీలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఆదాయం తీసేస్తే మిగతా జిల్లాల ప్రజల తలసరి ఆదాయం ఎంతో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.