Thursday, January 23, 2025

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

పెంచికల్‌పేట్: ఈ నెల 30న జిల్లా కేంద్రంలో సీఎం కేసిఅర్ పర్యటనలో భాగంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 న సీఎం కేసిఅర్ జిల్లా నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంను ప్రారంభించనున్నారని ప్రధానంగా పోడు భూముల రైతులకు పట్టాల పంపిణి ఇక్కడి నుండే ప్రారంభం కావడం శుభపరిణామం అని అన్నారు.

ఈ బహిరంగ సభకు మండలానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన కొండపల్లి, పెంచికల్‌పేట్, అగర్‌గూడ గ్రామాలకు చెందిన పలువురు బిజేపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బిఅర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కండువ కప్పి అహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బిఅర్‌ఎస్ మండల అద్యక్షులు చౌదరి తిరుపతి, సర్పంచ్‌లు సంజీవ్, శ్రీనివాస్, రాజన్న, దేవాజీ, ఎంపిటిసి రాజన్న, కోఅప్షన్ సభ్యులు సాజిద్, నాయకులు శ్రీనివాస్, బండన్న, వెంకటచలం, సదాశివ్, ఖైరత్, బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News