Thursday, November 21, 2024

పట్టణాన్ని పచ్చని సుందర వనంలా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సూర్యాపేట పట్టణాన్ని సుందర వనంలా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల పచ్చదనం ఉట్టిపడేలా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన అన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా మ ంగళవారం నుంచి దురాజ్‌పల్లి వరకు నేషనల్ హైవే 65కు ఇరుపక్కల గల మొక్కలను డిఆర్‌డిఏ పిడి కిరణ్‌కుమార్, డిఎఫ్‌ఓ సతీష్ కుమార్‌తో కలసి పరిశీలించారు.

జాతీయ రహదారిపై పచ్చగా కనిపించేలా మొ క్కలు నాటాలని, జాతీయ రహదారి పక్కన నాటిన మొ క్కలు ఎదుగుదల లేని చోట కొత్త మొక్కలు నాటాల ని సూచించారు. జనగాం క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద పూలమొక్కలు నాటి సుందరీకరణ చేపట్టాలని ఆదేశించా రు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్ర పరచాలని, వారం రోజులలో మొక్కలు నాటి సమీకృత మార్కెట్ సిద్ధంగా ఉంచాలని మున్సిపల్ క మిషనర్ రామానుజుల రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నా యక్, హార్టికల్చర్ అధికారి శ్రీ ధర్, డిప్యూటీ డిఆర్డిఓ పెంటయ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News