Monday, December 23, 2024

సిఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి : సిఎం సహాయ నిధి పథకాన్ని పేద, మధ్య తరగతి ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వట్టెం, కారుకొండ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్‌ఓసి లెటర్లను ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.

వట్టెం గ్రామానికి చెందిన సొంటం ఆంజనే యులుకు లక్షా 50 వేల రూపాయలు, కారుకొండకు చెందిన వేముల లక్ష్మి కళకు 2 లక్షల 50 వేల రూపాయల ఎల్‌ఓసి లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వట్టెం గ్రామానికి చెందిన సొంటం ఆంజనేయులుకు గతంలో రెండు సార్లు లక్షా 50 వేలు, లక్ష రూపాయల ఎల్‌ఓ సిలను అందజేయడం జరిగిందని, మళ్లీ నేడు మరో లక్షా 50 వేల రూపాయల ఎల్‌ఓసిని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బత్తిని తిరుపతి రెడ్డి, పార్టీ నాయకులు శేఖర్ రావు, పలువురు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News