Saturday, January 11, 2025

రేపు జరిగే దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 19న హరితోత్సవం, 20న విద్యాదినోత్సవం సందర్భంగా ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ శివారులో సిద్దిపేట రింగ్ రోడ్డు చుట్టు హరితోత్సవంలో భాగంగా రింగ్ రోడ్డు పనులు పూర్తి అయిన ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయాలని పారెస్టు అధికారులకు తెలిపారు. మొక్కులు ఐదు ఆరు ఆడుగుల మొక్కలు మాత్రమే తీసుకోవాలన్నారు. రోడ్డు ఇరువైపుతా సుమారుగా ఒక మీటర్ పుట్ పాత్ త్వరలోనే మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. అదే విధంగా పొన్నాల శివారులోని పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో 20న విద్యా దినోత్సవ ఏర్పాట్ల పనులు పరిశీలించారు. విద్యలో జిల్లా ఎంతగానో దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి మంత్రి హరీశ్‌రావు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఫలితాలు అలాగే 10/10 జిపిఎ వచ్చిన ప్రతి ఒక్కరికి నగదు బహుమతి అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాల వారికిగా సిట్టింగ్ అలన్మెంట్ చేయాలని అధికారులకు సూచించారు. మన ఊరు మన బడి పథకం పనులు పూర్తి అయిన పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. ప్రతి ఒక్కరికి భోజన సదుపాయానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఫారెస్ట్ అధికారులు, మంత్రి ఓఎస్‌డి బాల్‌రాజు, విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News