Monday, December 23, 2024

యాగశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: సోమవారం ఏడుపాయలలో ప్రారంభించనున్న యాగశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం పరిశీలించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత హరితహోటల్‌లో పట్టాల పంపిణీ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మెదక్ పట్టనంలోని సాయిబాలాజీ గార్డెన్‌లో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, ఎలాంటి లోటుపాట్టకు తావివ్వకుండా సభ, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.

కలెక్టర్ వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, డిఎస్పి సైదులు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ జానకిరామ్, ఆర్డీవో సాయిరాం, పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, కొల్చారం తహశీల్దార్ చంద్రశేఖర్, ఏడుపాయల ఈఓ సార శ్రీనివాస్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News