Wednesday, November 6, 2024

రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మెదక్: శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించబోయే రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లను, వేదికను, వివిధ శాఖలు ఏర్పాటు చేయబోయే స్టాల్ల్, ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ ప్రాంతాలను ఇంచార్జి ఎస్పి సింధు శర్మ, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పశు సంవర్దక, మత్స, పాడి అభివృద్ధ్ది శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సరిగ్గా ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావించిన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జిల్లాలో అమలుజరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు.

ఆ తరువాత అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రశంసపత్రాల ప్రదానం, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ల్‌ను సందర్శించి లబ్ధ్దిదారులకు రుణాలు పంపిణీ చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని డిఈఓకు సూచించారు. అనంతరం హై టీ ఉంటుందని, ఈ కార్యక్రమలంతా సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News