Friday, November 15, 2024

రాజపేట మండలంలోని వాగులను సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏ ర్పడే వరద పరిస్థితులపై జాగ్రత్తగా ఉండాలని,ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.గురువారం రాజపేట మ ండలం రఘునాథపురం,పొట్టిమర్రి వాగు ,చల్లూరు,బేగంపేట రేణిగుంట వాగులను పరిశీలించారు.వాగుల వద్ద 24/7 నిరంతర గస్తీ ఉండాలని.అధికారులను ఆదేశించారు.

చెరువులు,వాగులు ఉప్పొంగి ప్రవహిస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ,జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుండి బయటకి రాకుడదని,అత్యవసర సహాయం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ నెంబర్ 08685 -293312,వాట్సాప్ నెంబర్ 9121147135 వినియోగించుకోవాలని కోరారు.

గ్రామాలలో టామ్ టామ్ ద్వారా పాతబడిన ఇళ్లలో,శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో నీటికి బాగా నానిన ఇళ్ళల్లో ఎవరినీ ఉండనీయకుండా దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్,గ్రామ పంచాయతీ భవనం,పాఠశాలల్లో,సురక్షిత ప్రాంతాలలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఎక్కడా ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో తహసిల్దార్ రవికుమార్, ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి, రెవిన్యూ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News