Saturday, December 28, 2024

ధరణిలో 119 లోపాలు

- Advertisement -
- Advertisement -

పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని గుర్తించిన కమిటీ

భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్టాప్‌వేర్ అవసరం
రెవెన్యూ అధికారులకు చట్టబద్ధతతో కూడిన అధికారాలు ఇవ్వాలి
న్యాయస్థానం వెళ్లకుండా రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలి
సచివాలయంలో మొదటి సమావేశం నిర్వహించిన ధరణి కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసేందుకు ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈకమిటీ సభ్యులు కోదండ రెడ్డి, లచ్చి రెడ్డి, సునీల్‌ రెడ్డి మొదటి సమావేశం గురువారం డా. బిఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాల ఉన్నట్లు గుర్తించి వాటి పరిష్కారం కోసం పటిష్ట మైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని గుర్తించారు.

ఆర్వో యాక్ట్ ఉన్నప్పటికీ స్పష్టమైన గైడ్ లైన్స్, ప్రోటోకాల్ చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని కమిటీ గుర్తించింది. రెవెన్యూ శాఖలో సరైన బిజినెస్ రూల్స్ రూపొందించక పోవడంతో అధికారులు అయోమయానికి గురై రైతులకు సమస్యల పరిష్కారం చూపలేకపోయారని, అధికార వికేంద్రీకరణ లేకపోవడంతో సమస్య ఉత్పన్నం అయినప్పుడు కోర్టును ఆశ్రయించే దుస్దితి నెలకొంది. ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందనే విషయాలను గుర్తించినట్లు తెలిసింది. మండల స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్‌డిఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిల్లో సిసిఎల్ అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసేందుకు విధివిధానాలపై దరణి కమిటీ చర్చించింది.

ఈనెల 17న మరోసారి ధరణి కమిటీ సమావేశం కానుందని సభ్యులు తెలిపారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులు కోదంద రెడ్డి, లచ్చి రెడ్డిలు మాట్లాడుతూ ధరణి సమస్యలపై మొదటిసారి కమిటీ సమావేశం నిర్వహించామని, దీనిలో రైతుల భూసమస్యలు, వాటిని పరిష్కారిచేందుకు కావాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యుపిఏ హయాంలోనే దేశ వ్యాపంగా భూసర్వే చేసేందుకు నిర్ణయం తీసుకుని అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసినట్లు, ఒక తెలంగాణలో మాత్రమే జరగలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017లో కెసిఆర్ ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడంతో లక్షలాదిమంది రైతులు భూమి హక్కులు కోల్పోయారని, ప్రభుత్వానికి, అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో చాలా మంది అన్నదాతలు ఆత్మహత్య చేస్తుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ధరణిపై పోరాటం చేశారని, అప్పట్లో అనేక మంది నిపుణులతో సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో రైతులకు భూసమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు. అదే విధంగా సిసిఎల్‌ఏ కార్యాలయంలో ధరణి కమిటీకి ప్రత్యేక కార్యాలయం కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా రైతులకు సమస్యలుంటే వాటిని కమిటీ చర్చి పరిష్కారించేందుకు కృషి చేస్తుందన్నారు. అనంతరం భూచట్టాల నిపుణులు సునీల్ వివరిస్తూ ధరణి కమిటీ పరిష్కారం చూపేందుకే నిరిష్ట కాలపరిమితి లేదని రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులకు సూచనలు, సలహాలు చేస్తామని, అవసరమైతే పలు గ్రామాలకు వెళ్లి పరిష్కారించేందుకు చొరవ చూపుతామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News