Sunday, November 17, 2024

పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం కెసిఆర్‌తోనే సాధ్యం

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: పాలమూరు, రంగారె డ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేయడం ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మా త్రమే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తె లంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా నియోజకవర్గంలోని మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్ల పరిధిల్లో గల సందచెరువు, పోచమ్మకుంటల వ ద్ద తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టిపడే వి ధంగా గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించి న ఊరూరా చెరువుల పండుగలో మంత్రి సబిత ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరానికి ప్రస్తుతం కొనసాగుతున్న కృష్ణా, గోదావరి జలాల సరఫరాలో ఎటువ ంటి అవాంతరాలు తలెత్తినా హెచ్‌ఎండిఏ పరిధి చు ట్టూ వలయం మాదిరిగా ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చే సేందుకు ముక్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని అ న్నారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్న ఘనత కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు ద క్కుతుందని, సమర్ధవంతమైన నాయకుడి పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,శాంతి,భద్రత ల పరిరక్షణతో పాటు పరిశ్రమల స్ధాపన అణుమతుల ను సులభతరం చేయడంతో రాష్ట్రనికి పెట్టుబడులు వె ల్లువలా వస్తున్నాయని అన్నారు. ఎన్‌ఎన్‌డిపి పనుల కోసం రూ.1200 కోట్ల నిధులు కేటాయించగా వీటి ల్లో రూ.110 కోట్లతో నియోజకవర్గంలో నాళాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో గుర్రంగూ డ, కుర్మల్‌గూడ, జిల్లెలగూడ, బడంగ్‌పేట్‌లలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

అదే విధం గా బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీల్లో రూ.40 కోట్లతో 10 చెరువులను అభివృద్ధి, సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్న మహిళ లు బతుకమ్మలు, బోనాలు, పోతురాజుల నృత్యాల మధ్య మంత్రి సబితకు పెద్దసంఖ్యలో స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల్లో ఆర్డిఓ సూరజ్‌కుమార్,తహశీల్దా ర్ జనార్ధన్‌రావు,ఆయా కార్పొరేషన్ల కమీషనర్లు చిట్టి నాగేశ్వరరావు,టి కృష్ణమోహన్‌రెడ్డి, మీర్‌పేట్ మేయర్ ముడావత్ దుర్గ, డిప్యూటి మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, బిఆర్‌ఎస్ అధ్యక్షులు అర్కల కామేశ్‌రెడ్డి, రామిడి రాంరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్‌సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News