Monday, December 23, 2024

బస్సు రూట్ మార్చాలని విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -
  • తట్టేపల్లి మీదగా బస్సు నడపాలని విజ్ఞప్తి

పెద్దేముల్: ఆర్టీసీ బస్సు రూట్ మార్చాలని విద్యార్థులు రోడ్డెక్కారు. పెద్దేముల్ మండల పరిధిలోని ఓమ్ల నాయక్ తండాకు తాండూరు డీపో నుంచి బస్సు సౌకర్యం కలదు. అయితే ఆ బస్సు రూట్‌ను మార్చాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి నేరుగా ఓమ్లనాయక్ తండాకు వచ్చి.. అటు నుంచి జరరాం తండా(ఓ), పాషాపూర్, అడ్కిచర్ల, గుండ్లమడుగు తండా, జీన్గుర్తి గ్రామాల మీదగా తాండూరుకు వెళ్తుందన్నారు.

తద్వారా తట్టేపల్లి, సిద్ధన్నమడుగు తండా, ఆత్కూరు, గొట్లపల్లి, ఇందూరు గ్రామాల విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆర్టీసీ బస్సును తట్టేపల్లి మీదుగా తాండూరుకు నడపాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యార్థులకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ధర్నాలో కేతావత్ పవణ్, సునీల్, రామ్, జగన్నాథ్, చందర్, కిశోర్, గోపిచంద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News