Monday, November 18, 2024

గ్రూప్ 1 పరీక్ష నిర్వహణను యుపిఎస్‌సికి అప్పగించాలి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గ్రూఫ్ 1 పరీక్ష పే పర్ లీకేజీ కేసు పూర్తి కాకుండా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఇప్పటీ తిష్ట వేసిన లీకేజీ దోషులను తొలగించకుండానే బోర్డు ఆధ్వర్యంలో మరో పరీక్ష నిర్వహించడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య తప్పు బట్టింది. శుక్రవారం నగరంలోని ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె.ధర్మేందలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాల కలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగాలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యమైదన్నారు. కానీ అత్యంత కీలకమైన టీఎస్‌పీఎస్సీ పనితీరు నేడు నిరుద్యోగులను అంధకారంలోకి నెట్టివేసేలా లోపభూయిష్టంగా పోటీ పరీక్షల నిర్వహణకు సిద్ధ్దమైందంటూ విమర్శించారు.

ఎన్నో ఏ ళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూసిన గ్రూప్ 1 పరీక్ష కోసం కష్టపడి చదివితే అది కాస్త కొంతమంది దుర్మార్గులు ఆడిన వికృత వలయంలో ప్రశ్నాపత్రాల లీకేజీతో పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేసినట్టయిందన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీకి) నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

ఒక వైపు ప్రశ్నపత్రాల లీకేజీలకు సంబంధించిన నింధితుల విచారణ, దర్యాప్తు పూర్తిగా జరగకుండానే, కమీషన్ లో ఉన్న లీకేజీ దోషులను తొలగించకుండానే,టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ఆధ్వర్యంలో మరల పరీక్షలను నిర్వహించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమే అన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నా వాటిని పకడ్బందీగా నిర్వహించలేకపోయిన టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ను ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ హైదరాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల కార్యదర్శలు ఎన్. శ్రీకాంత్, సత్య ప్రసాద్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News