Wednesday, January 29, 2025

రైతులను గోస పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

- Advertisement -
- Advertisement -

లక్షెట్టిపేట: రైతులను గోస పెట్టిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే దివా కర్‌రావు అన్నారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రైతు వేధికల్లో రైతులో పాటు నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా మంగళవారం వెంకట్రావ్‌పేట రైతు వేధికలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగు చేయకుండా వ్యవసాయాన్ని అదోగతిపాలు చేసి రైతన్న ఆ త్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టే విధంగా రేవం త్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న వాఖ్యలప రైతులకు కాంగ్రెస్ పార్టీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు పరిస్ధితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నాడు నాటు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు.

ఎండాకాలం వచ్చిదంటే ఎండిన పంటలు, సబ్ స్టేషన్‌ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తు చేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక వైపు సాగు నీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులతో పూడిక తీశారన్నారు. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News