Wednesday, January 22, 2025

బడుగు, బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ

- Advertisement -
- Advertisement -
  • ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు
  • బాధిత కుటుంబాలకు 1.25 లక్షల ఆర్థిక సహాయం
  • కాంగ్రెస్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి రూరల్ : బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట గ్రామంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామానికి చెందిన 25 మందికి 5 వేల రూపాయల చొప్పున లక్షా 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా గ్రామాలలో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఐక్యత ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు.

  • వృద్ధ దంపతులకు అండగా ఐక్యతా ఫౌండేషన్

రఘుపతిపేట్ గ్రామానికి చెందిన నాగిశెట్టి వృద్ధ దంపతుల ఇంటి నిర్మాణానికి 50 వేల రూపాయలు, కృష్ణయ్య ఇంటి నిర్మాణానికి 40 సిమెంట్ బస్తాలు అందజేశారు. అనంతరం తుర్కలపల్లి గ్రామంలో వృద్ధురాలు బాలమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసి మొదటి విడతలో 50 వేల రూపాయలు అందజేశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి రెండు రహదారులకు ఒక్కొక్క రహదారికి 50 వేల చొప్పున ఒక లక్ష రూపాయలను రైతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రఘుపతిపేట గ్రామ సర్పంచ్ రేణుక బాలస్వామి, తుర్కలపల్లి మాజీ సర్పంచులు వీరపాకుల బాలయ్య, బాలమ్మ, ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ విజేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా, వార్డు సభ్యులు బాలు, రవి, భీమయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News