Sunday, January 19, 2025

కాంగ్రెస్ శ్వేతపత్రం అవినీతి పత్రం

- Advertisement -
- Advertisement -

ఈనెల 28న రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అవినీతి పత్రమని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం తమ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధిపొందుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తెలగాణలో ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని అన్నారు. అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంరగకలాన్ గ్రామంలో అమిత్ షా సమావేశం ఉంటుందని చెప్పారు.
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:  కిషన్‌రెడ్డి
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి హెచ్చరించారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అవసరమైతే కొవిడ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తామని, కొత్త వేరియంట్ జేఎన్1 వ్యాప్తి వేగంగా ఉంటోందన్నారు. అయితే ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని తెలిపారు. కొవిడ్ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News