Sunday, December 22, 2024

కుట్ర కోణాన్ని ఛేదించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అధికార పార్టీ నాయకుడిపై దాడి జరిగితే.. కోడి కత్తి అంటూ ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు మండి పడ్డారు. యశోద ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న ఎంపి కొత్త ప్రభాకర్ రె డ్డిని మంగళ వారం మంత్రి హరీశ్‌రావు ప రామర్శించారు. అనంతరం ఆయన మీ డి యాతో మాట్లాడుతూ,తెలంగాణలో ఇ లాంటి రాజకీయాలు ఎప్పుడూచూడ లేద ని, ఇలాంటి రాజకీయాలను రాయలసీమ, బిహార్‌లోనే చూశామని అన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షా లు అధికార పక్షాన్ని అపహాస్యం చేస్తున్నా యని వాపోయారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు.

నిందితుడి కాల్ డాటా సేకరించారని.. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నానని హరీశ్ రావు తెలిపారు. కత్తి దాడితో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి పరామర్శించారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తె లిపారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ ప్రజాప్రతినిధిపై కత్తితో దాడి చేస్తే కోడి కత్తి అంటూ ప్రతిపక్ష నేతలు అప హాస్యం చేస్తున్నారని, బిఆర్‌ఎస్ పార్టీకి అలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల రంధ్రాలు పడితే, ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. ఘటనను ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లా డుతున్నాయని.. సీనియర్ నాయకులూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పని తనం తప్ప పగతనం లేని నాయకుడు కెసిఆర్ అని.. అలా పగ ఉంటే ఇప్పటికే ఎంతో మంది జైళ్లలో ఉండేవారని చెప్పారు. ఏదేమైనా ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదని స్పష్టం చేశారు.

ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక భారాస అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభా కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం యశోద వైద్యులు ఎంపి ప్రభాకర్‌రెడ్డి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనకు సర్టికల్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నామని, అక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతత విభాగాలతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తా రని తెలిపారు. ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డికి ఐవి ఫ్లూయిడ్స్, నొప్పి మందులు, యాంటి బయాటిక్స్ అందిస్తున్నామని చెప్పారు. రోగి స్పృహలో ఉన్నా రు అని, ప్రస్తుతం ఆయన పెద్ద శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నారని అన్నారు. ప్రభాకర్‌రెడ్డి మరో 24 గంటల నుంచి -48 గంటల పాటు క్రి టికల్ కేర్ యూనిట్‌లో ఉండాల్సి ఉంటుందని, ఆ తర్వాత అతని ఆరో గ్య పరిస్థితిని పరిశీలించి సాధారణ గదికి మార్చుతామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News