Monday, December 23, 2024

నిర్ణీత సమయంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీసీ రెన్యూవల్ రోడ్లను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో జాజ్యం జరిగినా.. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా కాంటారక్టర్లు, అధికారులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రస్తుత వర్షకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బుదరమయంగా మారి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న రోడ్లను గుర్తించి వెంటనే సీసీ రోడ్లను నిర్మించాలన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలు, శిథిలావస్థలో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనాల స్థానంలో కొత్త గ్రామపంచాయతీ భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ, డీఈలు, ఏఈలు, కాంట్రాక్టు ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News