Wednesday, January 22, 2025

ఓయూలో నిరహార దీక్ష చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఓయూలో తమ డిమాండ్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ కళాశాల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని యూనివర్సిటీల ఒప్పంద అధ్యాపకులంతా దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1445 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 150 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పిన సిఎం కెసిఆర్ తన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News