Monday, January 20, 2025

కియారా మంగళసూత్రం ఖరీదు వింటే షాక్ అవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

అగర్తల: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ మల్హోత్ర, కియారా అదానీ వివాహ వేడుకలు ముగిసినప్పటికీ ఆ పెళ్లివేడుకకు సంబంధించిన విశేషాలు, ఆర్భాటాల గురించి మాత్రం ఇప్పట్లో వార్తలు ఆగేలా లేవు. తాజాగా..కియారా అద్వానీ ధరించిన మంగళసూత్రం ఇప్పుడు వార్తల్లో ఎక్కింది.

మధ్యలో పెద్ద వజ్రం, నల్లపూసలతో కూడిన బంగారు మంగళసూత్రం ఖరీదు అక్షరాలా రూ. 2 కోట్లని వార్తలు బయటకు వచ్చాయి. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఈ మంగళసూత్రం కోసం సిద్ధార్థ మల్హోత్ర రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడని తెలుస్తోంది. ఈ డబ్బుతో రెండు లగ్జరీ బిఎండబ్లు కార్లు వస్తాయన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్‌లో జరుగుతోంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోగల సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7న సిద్ధార్థ మల్హోత్ర, కియారా అద్వానీల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News