Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పాలనలో దేశం దివాళా..

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో ప్రజలు విశ్లేషించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం గూడూరు, తిరుమలగిరి, కిష్టపురం, నర్సింగాపురంతండా, గోపాలపురం, ఈరవెన్ను, కోతులబాద్ గ్రామాలకు కలిపి గూడూరలో, ఎల్లరాయని తొర్రూరు, లక్ష్మీనారాయణపురం, తీగారం, శాతపురం, దుబ్బతండా ఎస్, అయ్యగారి పల్లె గ్రామాలను కలిపి పాలకుర్తిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

14 ఏళ్ల ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఉద్యమ సారథి కేసీఆర్ సీఎం కావడం మనందరి అదృష్టమని, అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సాగుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, మన రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్ది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కట్టిన ప్రాజెక్టులతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది అందరికి తెలిసిందేనని అన్నారు.

ప్రస్తుత బీజేపీ పాలనలో ఎల్‌ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం ద్వారా దేశం అధోగతి పాలైందన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత 24 గంటల విద్యుత్ వెనక సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి ఏటా రైతుల తరుపున 10వేల 500 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు కడుతున్నారన్నారు. రైతు చనిపోతే 10 రోజుల్లోపే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తుందన్నారు. చివరకు రైతుల పంటలను కూడా కొనుగోలు చేస్తున్న విషయాన్ని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ వచ్చాకే వ్యవసాయం అందరికి పండుగైందన్నారు. ఏడాదికి రూ.30వేల కోట్ల నష్టం జరుగుతున్నప్పటికీ రైతులకు మద్దతు ధర పెట్టి వారు పండించిన ధాన్యాన్ని, మక్కలను కొనుగోలు చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News