Monday, December 23, 2024

దేశం చూపు సిఎం కెసిఆర్, తెలంగాణ వైపు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : చేతి వృత్తులకు, కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు, బిసిలలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు సి ఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం బిసి బంధు అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 18 మంది సిఎంలు మారారు కానీ ఏ సిఎం ఇ లాంటి పథకాలు అమలు చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దేశం మొత్తం సిఎం కెసిఆర్ వైపు, తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు.

దేశానికి కెసిఆర్ ప్రధాని కావాలి
తెలంగాణ సిఎం కెసిఆర్ రానున్న రోజుల్లో దేశానికి ప్రధాని కావాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆకాంక్షించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సిఎం కెసిఆర్ జాతిపిత అని ఎమ్మెల్యే అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్షంగా సిఎం ముందుకు సాగుతున్నారని అన్నారు.

తెలంగాణ నీరు, నిధులు, నియామకాలను ఆంధ్రాకు తరలించుకుపోతున్న తరుణంలో సిఎం కెసిఆర్ మన నీళ్లు మనకే, మన ఉద్యోగాలు మనకే, మన నిధులు మనకే మళ్లించిన ఘనుడు అని ఎమ్మెల్యే అన్నారు. మైనార్టీలకు మరోమారు మైనార్టీ బంధును అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం మహిళల సాధికారతకు కుట్టుమిషన్ అందిస్తామని అన్నారు.

చారకొండలో 1607 దళిత బంధు
ఉమ్మడి కల్వకుర్తి నియోజకవర్గంలోని చారకొండ మండలంలో 1607 మందికి దళిత బంధు అందజేశామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. అలాగే మిగిలిపోయిన మరో 267 మందికి మళ్లీ దళిత బంధును అందజేస్తామని అన్నారు. అలాగే కల్వకుర్తి మండలంతో పాటు నియోజకవర్గంలో 1200 దళిత బంధు యూనిట్లు అందజేశామని అన్నారు.

72 వేల కోట్లు రైతు బంధు అందజేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. లక్షకు పైగా రైతులకు రైతు భీమా అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు 13 వేల కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద అందజేశామని అన్నారు. అనంతరం బిసి బంధు చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుదమని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఎన్నికల్లో సీజన్‌లో కాంగ్రెస్, బిజెపి లాంటి మోసపు పార్టీలు ఓట్ల కోసం వస్తారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్షం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిఆర్‌ఎస్ పార్టీకి దరిదాపుల్లో లేదని అన్నారు. పార్టీకి నష్టం చేసే పని ఎవ్వరు చేయవద్దని ఎమ్మె ల్యే అన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని నిబద్ధత గల నాయకునిగా పాటిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగం విజయ్ గౌడ్, వైస్ ఎంపిపి సామ మనోహర చెన్న కేశవులు, మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మెన్ షాహి ద్, కౌన్సిలర్స్ శ్రీశైలం, బావండ్ల మధు, నూనె యాదమ్మ శ్రీనివాస్, రావు రవీందర్, సర్పంచులు సంఘం అధ్యక్షులు ఎముక జంగయ్య, జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు గుమ్మకొండ రాజు , ఎంపిటిసి గుత్తి వెంకటయ్య రవీందర్ రెడ్డి, బలేమియా, ఎంపిడిఓలు ఆంజనేయులు, జయసుధ, శ్రీనివాసులు, అధికారిణి రాజకుమారి, నాయకులు, బన్నె శ్రీనివాస్, బన్నె శ్రీధర్, మాజీ సర్పంచ్ రాకేష్ శర్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News