Thursday, January 23, 2025

తెలంగాణ గురుకుల విద్యావిధానంపై దేశమే ఆశ్చర్యపోతోంది : మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ బంజారా సేవా భవన్ లో నిర్వహించిన ట్రాన్సెండ్ ప్రిన్సిపాల్స్ సెమినార్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు. తెలంగాణలో గురుకుల విద్యావిధానంపై దేశంలోనే చర్చ జరుగుతోందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు తెలంగాణ గురుకుల విద్యాసంస్థలను అధ్యయనం చేసేందుకు వచ్చి వెళుతున్నారని చెప్పారు.

అద్బుతమైన ఫలితాలు సాధించడం ఒక గొప్పవిషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 293 గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,004కు పెంచుకోవడం జరిగిందన్నారు. నాడు వసతుల లేమితో ఎంతో మంది విద్యార్థులు గురుకులాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారని, విద్యార్ధులకు మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన విధ్య అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పినఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకులాల్లో ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు.

గురుకులాల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి పౌష్టికాహరం అందించడంతో పాటు అన్ని వసతులు కల్గిన సొంత భవనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వేల సంఖ్యలో విద్యార్ధులు ఉత్తమ స్థాయిలో నిలబడడం ఎంతో గర్వకారణ మన్నారు. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఈ సందర్భంగా గురుకుల సిబ్బందిని మంత్రి కొప్పుల అభినందించారు. విద్యార్ధులను సొంత బిడ్డలాగా ప్రేమను కనబరుస్తున్నారని చెప్పారు. విద్యార్ధులపై నిరంతరం పర్యవేక్షిస్తూ.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని చెప్పారు. ఈ సెమినార్ లో తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్స్ సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్ తో పాటు పలువురు ప్రన్సిపాల్స్ పాల్గొన్నారు.

Koppula Eshwar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News