రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా కేంద్రంపై
యుద్ధం కొనసాగిస్తాం కెసిఆర్ అడిగిన
ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేరు
హైదరాబాద్ : దేశానికి కెసిఆర్ వంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్న కు మోడీ సమాధానం చెప్పలేదన్నారు. మోడీపై పోరాటం రాష్ట్రపతి ఎన్నికతోనే ఆగదని, తరువాత కూడా కొనసాగుతుందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌ను కలుపుకొని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ విజన్ బాగుందన్నారు. దానిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తమ పోరాటం భారత భవిష్యత్ కోసమేనన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూలాలను రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నా మన్నారు. మోడీపై కెసిఆర్ మాట్లాడిన ప్రతి పదం వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కెసిఆర్ ఒక్కరే పార్లమెంట్‌లో కొట్లాడారని, ఆయన తన స్వప్నం నెరవేర్చుకున్నార న్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణను దేశంలో నెంబర్ గా నిలిపారని యశ్వంత్ సిన్హా కెసిఆర్‌ను ప్రశంసించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు టిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నందుకు సిఎం కెసి ఆర్, మంత్రి కెటిఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కెసిఆర్ సవివరంగా చె ప్పారని సిన్హా తెలిపారు. తెలంగాణలో ప్రజా చైతన్యాన్ని ప్రత్యక్షం గా చూస్తున్నానని చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుం టే చూస్తూ ఉండలేమన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమన్నారు. విద్వేషపూరిత ప్రసంగా లు సమాజానికి మంచిదికాదని, ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించా రు. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్ కోసం కాదని మన పి ల్లల బంగారు భవిష్యత్ కోసం చేసే పోరాటమిది అని యశ్వంత్ సి న్హా పేర్కొన్నారు. తనకు తెలంగాణలో ఇంత ఘనస్వాగతం లభి స్తుందని ఊహించలేదని, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సిన్హా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఇద్దరి ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ అని ఆయన పేర్కొన్నారు.