Friday, December 20, 2024

చీకోటి ప్రవీణ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కు ఊరట లభించింది. అక్కడి కోర్టు చీకోటి ప్రవీణ్ తో సహా 83 మంది భారతీయులకు అక్కడి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. థాయ్‌లాండ్ లో ని పట్టాయలోని ఓ హోటల్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చీకోటి ప్రవీణ్ దొరకటం విదితమే.4500బాట్స్ జరిమానాతో చీకోటి తో పాటుఇతర నిందితులకుకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫైన్ చెల్లించడంతో నిం దితులకు పోలీసులు పాస్ పోర్టులు తిరిగిచ్చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన చీకోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో పోకర్ నిషేధమని తనకు తెలియదని తెలిపారు. తాను హాల్‌లో వెళ్లిన 10 నిమిషాలకే దాడి జరిగిందని చెప్పారు. తాను ఆర్గనైజర్‌ను కాదని, తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. దేవ్, సీతా తనకు ఆహ్వానం పంపారని చెప్పారు.

నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ ఉందని చెబితే వెళ్లానని తెలిపారు. పోకర్ టోర్నమెంట్ లీగల్ అని వారు తనకు చెప్పారన్నారు. ఇక, థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవం తమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా అందులో 83 మంది భారతీయులు ఉన్నారు. అరెస్టయిన వారిలో బిఆర్‌ఎస్‌నేత, మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎపిలోని నెల్లూరు, గుడివాడకు చెందిన సుమారు 20 మంది ఉన్నారని సమాచారం. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 11 నుండి 16వ తేదీ వరకు కూడా చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాబ్లింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News