Wednesday, January 22, 2025

సిలిండర్లు పేలి స్టోర్ రూం దగ్ధం

- Advertisement -
- Advertisement -

కోడేరు ః నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని తీగలపల్లి గ్రామ సమీపంలోని మెగా కంపెనీలో స్టోర్ రూంలోని రెండు సిలిండర్లు గురువారం పేలడంతో స్టోర్ రూం పూర్తిగా దగ్ధమై అందులోని సామన్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెలరేగిన మంటలను ఆర్పివేశారు. స్టోర్ రూంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణహానీ తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి సిఐ యాలాద్రి చేరుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోడేరు ఎస్సై శేఖర్ రెడ్డి, పెద్దకొత్తపల్లి రాజు యాదవ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News