Monday, January 20, 2025

తెలంగాణకు పండుగరోజు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫిబ్రవరి 18 వ తేదీ…. తెలంగాణ కొత్త చరిత్రకు నాంది ప లికిన రోజుగా మంత్రి హరీష్‌రావు, ఎంఎల్‌సి కవిత అభివర్ణించారు. ఇదే రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన ఉద్యమ స్ఫూర్తిగా కేంద్రం దిగొచ్చి లోక్‌సభలో ఎపి పునర్వ్యస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణకు 18వ తేదీ అత్యంత పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు లైన్ క్లియర్ అయిన రోజన్నారు. ఈ మేరకు శనివారం వారు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన జరిగిందన్నారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన చెప్పిన రోజని వారు పేర్కొన్నారు.

పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కెసిఆర్ ఒక దేశానికే కాకుండా ప్రపంచానికే నిరూపించిన రోజు అని అన్నారు. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా 20వ తేదీన బిల్లును ఆమోదించిందన్నారు. అక్కడి నుంచి 2014 మార్చి 1 దా కా రాష్ట్రపతి ఆమోదముద్ర పడే వరకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిందన్నారు. ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష అక్షర రూపం దాలు స్తూ 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన అనంతరం రాష్ట్ర ఆవిర్భావ (అపాయింటెడ్ డే) దినోత్సవంగా జూ న్2న ప్రకటించడం ఓ అపూర్వ ఘట్టమ ని, ఉద్యమ రథసారధి, సిఎం కెసిఆర్ నా యకత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2న కొలువుదీరడంతో తెలంగాణ రాష్ట్రానికి సువర్ణాధ్యాయం మొదలైందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News