Friday, December 20, 2024

ఈ నెల 5వ తేదీ వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -
తేదీ పొడిగింపు పట్ల అధ్యాపక సంఘాలు హర్షం

హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా చేరడానికి విద్యాశాఖ ఈనెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అదే విధంగా రూ. 500 అపరాధ రుసుముతో ఈనెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. అన్ని ప్రభుత్వం, ప్రైవేటు జూనియర్ కళాశాల్లో ఆసక్తిగల విద్యార్థులు చేరవచ్చని వెల్లడించింది. విద్యాశాఖ గడువు పొడిగింపు పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో అడ్మిషన్ ఇబ్బందులు కలుగుతున్న సమయంలో చేరేందుకు గడువు పొడిగించడానికి ఉత్తర్వులు ఇచ్చిన గౌరవ ఇంటర్ విద్యా కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు ధన్యవాదాలు తెలిపారు.దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువుల వైపు వెళ్లే అవకాశ ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News