Saturday, November 2, 2024

పాలకుల నిర్లక్ష్యంతోనే థానేలో చిన్నారుల మృత్యువాత

- Advertisement -
- Advertisement -

బాలల హక్కుల సంక్షేమ సంఘం

మన తెలంగాణ / హైదరాబాద్ : మహారాష్ట్ర , థానేలోని ప్రభుత్వాసుపత్రిలో 24 మంది చిన్నారుల మృతి పట్ల బాలల హక్కుల సంక్షేమ సంఘం(బిహెచ్‌ఎస్‌ఎస్) విచారం వ్యక్తంచేసింది. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఈ దుర్భర పరిస్థితి ఎందుకుందని బిహెచ్‌ఎస్‌ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా.గుండు కిష్టయ్య, ఇంజమూరి రఘునందన్‌లు ప్రశ్నించారు.

ఈ ఘటన దరిమిలా పాలకులు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుంటారా, కాకమ్మ కబుర్లు చెప్తూ కాలం వెళ్ళ బుచ్చుతారా? అంటూ నిలదీశారు. చిన్న పిల్లల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నాణ్యమైన విద్య, వైద్యం పొందడం ప్రజల హక్కు అని వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులదని వారన్నారు. చిన్నారుల మృతికి మందుల కొరత కారణమని తెలుస్తోందని ఇది అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు సిగ్గు పడాల్సిన విషయమని వారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News