Sunday, December 22, 2024

అంబురామేశ్వర ఆలయ చైర్మన్ మృతి బాధాకరం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

పెద్దేముల్: మాజీ సర్పంచ్, శ్రీ అంబురామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వీరేశం మృతి అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామానికి చెందిన వీరేశం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వీరేశం కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ మేరకు పార్ధీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తట్టేపల్లి సర్పంచ్‌గా, ఆలయ కమిటీ చైర్మన్‌గా వీరేశం అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు. వీరేశం కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కరణం పురుషోత్తం రావు, నారాయణ గౌడ్, గెమ్యా నాయక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News