Thursday, January 23, 2025

పుతిన్‌కు ఎదురు తిరిగితే ఇంతే సంగతులు..

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాలో ఇటీవలే అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించిన ప్రైవేటు ఆర్మీ చీఫ్ యెవ్‌గెని ప్రిగోజిన్ విమాన విషాదాంతం చర్చకు దారితీసింది. ప్రిగోజిన్ ఆయనతో పాటు ఆయన అగ్రస్థాయి కమాండర్లు ఈ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇది ఖచ్చితంగా పుతిన్ ద్వారా సాగిన ప్రతీకార చర్యనే, ఈ క్రమంలో ఈ తిరుగుబాటుదారుడు హత్యకు గురయ్యారని విస్త్రత స్థాయిలో క్రెమ్లిన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వాగ్నెర్ మిలిటరీ కంపెనీ వ్యవస్థాపకులు అయిన ప్రిగోజిన్ మాస్కో నుంచి ప్రైవేటు విమానంలో మరో ఆరుగురితో కలిసి బయలుదేరారు. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఇది గ్రామీణ ప్రాంతంలో కుప్పకూలింది. వెనువెంటనే గాలింపు జరిగినట్లు, మృతులలో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ముగ్గురు విమాన సిబ్బంది సహా మొత్తం పది మంది దుర్ఘనలో మృతి చెందినట్లు రష్యా వైమానిక సంస్థ తెలిపింది. ప్రిగోజిన్ కూడా మృతి చెందినట్లు తెలిసినా ఆయన మృతిపై ఇప్పటికీ అధికారిక నిర్థారిత ప్రకటన వెలువడలేదు.

అయితే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వాగ్నెర్ ప్రధాన కార్యాలయంలో చాలా సేపటి వరకూ లైట్లు ఆర్పేసి ఉంచారు. శిలువ చిహ్నం ప్రదర్శించారు. భవనం వెలుపల ప్రిగోజిన్ మద్దతుదార్లు సంస్మరణ సభ నిర్వహించారు. కాగా విమాన పతన స్థలం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించుకుని ఉన్నాయి. మాస్కోకు ఉత్తర దిశలో వంద కిలోమీటర్ల పరిధిలోనే దుర్ఘటన జరిగింది. ఇక్కడికి భద్రతా బలగాలు వచ్చి ప్రత్యక్షంగా సమాచారం సేకరించారు. కాగా పలు ప్రపంచ స్థాయి నేతలు ప్రిగోజిన్ మృతిపై పుతిన్ పట్ల అనుమానాలతో ప్రకటనలు వెలువరించారు. ఇది అనుకున్న ఘటనే అని, రోజుల వ్యవధిలో జరిగిపోయిందని స్పందించారు. అయితే ఈ విమాన పతనం, ప్రిగోజిన్ మృతి వార్తలపై పుతిన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు . బ్రిక్స్ సదస్సును ఉద్ధేశించి ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించడంతోనే గడిపారు. ప్రమాదానికి కారణాలను ఆరాతీస్తున్నామని రష్యా అధికారులు తెలిపారు. పుతిన్ తన ప్రత్యర్థులను ఎవరిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఈ ఉదంతంతో మరోసారి రుజువు అయిందని ఆయన విమర్శకులు స్పందించారు.

పలువురు నేతలను ఏదో విధంగా బెదిరించడం, వారిపై హత్యాయత్నాలకు దిగడం, జైలులోకి నెట్టడం వంటి పరిణామాల క్రమంలో ఇది మరో తాజా ఘటన అని స్పందన వెలువడుతోంది. పుతిన్ మాజీ సన్నిహితుడు ఈ విధంగా ఉన్నట్లుండి ఆకాశంలో నుంచి నేలకు పడటం వంటి పరిణామం పెద్దగా విస్మయకరమేమీ కాదని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బక్ విమర్శించారు. అయితే ఈ విమాన ప్రమాదంపై పూర్తి నిజానిజాలు వెలుగులోకి రాలేదన్నారు. పుతిన్ రష్యాలో ఇటువంటివి జరగడం సహజమే అవుతుంది. మరణాలు, అనుమానాస్పద ఆత్మహత్యలు, కిటికీల్లో నుంచి జారి కిందపడటాలు వంటివి అనేకం జరుగుతాయి. వీటిపై వివరాలు వెలుగులోకి రావని ఆమె స్పందించారు.ప్రిగోజిన్ మరణంపై వివరాలు తనకు తెలియవు, అయితే ఇటువంటి ఘటనపై విస్తుపోవల్సిన పనిలేదు ..విషప్రయోగం అనుకున్నాం, కానీ ఈ విధంగా జరిగింది అమెరికా అధ్యక్షులు బైడెన్ ప్రిగోజిన్ మరణం అనుకున్న దానికన్నా ఆలస్యం అయిందన్పిస్తోంది. ఇది విమాన ప్రమాదం కావచ్చు లేదా పుతిన్ సాగించే మానసిక యుద్ధతంత్రం కావచ్చు.. ఎలన్ మస్క్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News