Wednesday, January 22, 2025

ముగిసిన దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : ఆరు దశాబ్దాల పరిపాలనలో ఉన్న తెలంగాణ ప్రజలు దాస్య శృంఖలాలు తెంచుకుని తొమ్మిదేళ్లు పూర్తై పదవ వసంతంలోకి అడుగిడిన వేళ తెలంగాణ ఘన కీర్తిని, ప్రగతి స్థానాన్ని జగతికి చాటేలా ఈ నెల 2 నుంచి మొదలైన దశాబ్ది వేడుకలు 22 రోజుల పా టు జరిగిన వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి.

స్వరాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్ర అవతరణతో ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ వీరుల అమరత్వాన్ని యాది చేసుకుంటూ మృత వీరుల బలిదానాలు స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించేలా అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో దశాబ్ది వేడుకలు ముగిశాయి.

22 రోజులు.. రోజుకో సంబురం
దశాబ్ది ఉత్సవాలు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవంతో ప్రారంభంమై 22 రోజుల పాటు అ ంగరంగ వైభవంగా సాగాయి. గ్రామాల ను-ంచి మొదలుకొని మండలాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు పండుగ వాతావరణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. తొ మ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్ర గతిని, సంక్షేమ పథకాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక్కో రోజు ఒక్కొక్క రంగంలో సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటారు. ప్రత్యేకంగా సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చాటారు

* తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చరిత్రలో స్వర్ణ లిఖితం : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
తెలంగాణలో ఈ నెల 2 నుంచి 22 వరకు జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు స్వర్ణ లిఖితమని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నిరంతరం శ్ర మిస్తున్నారని ఆయన అన్నారు. నీళ్లు, ని ధులు, నియామకాలే లక్షంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నేడు సబ్బండ వర్గా ల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ సారథ్యంలో సుపరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు.

రాష్టంలో మరోసారి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రా నుందని జైపాల్ యాదవ్ అన్నారు. ఒకనాడు ఎం డి నెర్రెలు వాసిన బీడు భూ ములు నేడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కృష్ణ మ్మ నీళ్లు పరవల్లతో రైతుల ఇంట ధాన్యపు సిరులు కురుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో నేడు పల్లెలకు, పట్టణాలను మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన జరిగిందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News