Sunday, December 22, 2024

పట్టాలు తప్పిన గూడ్సురైలు

- Advertisement -
- Advertisement -

The derailed goods train

పాట్నా : బీహార్‌లో బుధవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సురైలు గుర్పా రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో 57 బోగీలు బోల్తాపడ్డాయి. దీంతో రైలు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ధన్‌బాద్ డివిజన్ కొడెర్మా, మణిపూర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగిందని తూర్పు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ప్రమాదానికి అసలైన కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదని అధికారులు చెప్పారు. పదిరైళ్లను ఈ రూటు నుంచి వేరే రూట్లకు మళ్లించారు. మరో నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News