Thursday, January 23, 2025

వనపర్తి పట్టణంలో కోతుల విధ్వంసం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : కొద్ది రోజులుగా వనపర్తి పట్టణంలో కోతులు విధ్వం సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి కరెంట్ వైర్లు తెంపడం, ఇంట్లోకి దూసుకువచ్చి వస్తువులను చిందరవందర వేస్తూ తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడంతో గృహిణిలు బెంబేలెత్తిపోతున్నారని, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష ఐక్యవేదిక వారు బుధవారం డిమాండ్ చేశారు. వనపర్తిలో ఉదాసీనంగా ఉన్న అధికారులు, నాయకులు వారి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని, ఉత్సవాల సంబరాల్లో మునిగి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మంగళవారం జంగిడిపురంలో వానరాలు కరెంటు వైర్లను తెంపడంతో అక్కడున్న మహిళలు అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. వారు వెంటనే ఏఈకి ఫోన్ చేసి లైన్ మెన్ల సహకారంతో సమస్యను పరిష్కరించారు. పట్టణంలోని కోతులను పట్టి అడివిలో వదిలే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News