Saturday, December 21, 2024

బాండ్ల వివరాలు బయటపెట్టాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం సోమవారం భారతీయ స్టేట్ బ్యాంకును ఆదేశించింది. ప్రతి బాం డుకు సంబంధించిన విశిష్ట సంఖ్యతో సహా ఏ వివరాలను కూడా ఎస్‌బిఐ దాచకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని వివరాలను అందచేయవలసిన అవసరం ఎస్‌బిఐకి ఉంది అనడంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దాతలు కొనుగోలు చేసిన ప్రతి బాండుకు సంబంధించిన విశిష్ట సంఖ్య, సీరియల్ నంబర్‌తోసహా అన్ని వివరాలను అందచేయాలని తెలిపింది. భవిష్యత్తులో ఎటువంటి వివా దం తలెత్తకుండా ఎస్‌బిఐ చైర్‌పర్సన్ గురువారం (21 మార్చి) సాయంత్రం 5 గంటల లోగా కోర్టు లో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తమ వద్ద ఉన్న అన్ని వివరాలను అందచేశామని, ఎటువంటి వివరాలను ఆపలేదని అఫిడవిట్‌లో పేర్కొనాలని కూడా ధర్మాస నం ఎస్‌బిఐని ఆదేశించింది. కాగా. ఇప్పటి వరకు విక్రయించిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను మార్చి 6వ తేదీటా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బిఐని ఆదేశించింది. ఈ వివరాలను ఎన్నికల క మిషన్ మార్చి 13లోగా తన అధికారిక వెబ్‌సైట్ లో ప్రచురించాలని కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మ నోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రా జ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. బాండ్ల వివరా ల వెల్లడిపై తమ తీర్పును సుమోటోగా సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిష్ సి అగర్వాల్ లేఖను పరిశీలించడానికి సైతం సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇలా ఉండగా కొన్ని రాజకీయ పార్టీలను మినహాయించి ప్రధాన రాజకీయ పార్టీలేవీ దాత ల వివరాలను ఇవ్వలేదని అసోసియేషన్ ఫర్ డె మోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. కాగా..ఎరాజకీయ పార్టీలకు అందిన ఎన్నికల బాండ్ల వివాల వెల్లడిపై గణాంకాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ ప్రక్రియలో కోర్టును ఇబ్బంది పెడుతున్నారని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తు షార్ మెహతా ఆరోపించారు. దీనిపై సిజెఐ డివై చంద్రచూడ్ స్పందిస్తూ న్యామూర్తులుగా తాము చట్టం, రాజ్యాంగం ప్రకారం మాత్రమే పనిచేస్తామని తెలిపారు. దేశ రాజకీయ వ్యవస్థలో చట్టాల అమలు సక్రమంగా చూడడమే తమ బాధ్యతని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తమపై చ ర్చ జరుగుతోందని, అయితే వాటిని ఎదుర్కొనగలమని ఆయన చెప్పారు. తాము తమ ఆదేశాల అ మలు కోసమే ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News