Monday, December 23, 2024

ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : ఓటరు జాబితా ను ంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం లో కొల్లాపూర్ నియోజకవర్గం తహసిల్దార్‌లతో ఓ టరు జాబితాలో పిఎస్‌ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, నూతన ఓటర్ల నమోదు, ట్రా న్స్ జెండర్ ఓటర్ల నమోదు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో సిమిలర్ ఎంట్రీ మొదటి దఫా కింద క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు.

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్ల జాబితా నుంచి తొలగించిన, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం తమ వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉ న్నాయో లేదో ధృవీకరించాలని తహసిల్దార్‌లను ఆ దేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 268 పోలింగ్ కేంద్రాలలో 3433 గృహ సముదాయాలలో 6 ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్న 42 వేల 197 ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో 2 లక్షల 14 వేల 594 మంది ఓటర్లు ఉండగా అందులో లక్షా 95 15 మంది పురుషులు, లక్షా 5075మంది మహిళా ఓటర్లు ఉండగా కేవలం నలుగురు ట్రాన్స్ జెండర్లు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారని, నియోజకవర్గంలో చాలామంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని, సిడిపిఓల ద్వారా ట్రాన్స్ జెండర్ల ఓట్ల నమోదుకు సిడిపిఓల సహకారం తీసుకుని ట్రాన్స్ జెండర్ల ఓట్ల శాతాన్ని పెంచాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గ పరిధిలో 18,19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు కేవలం 1862 మంది మాత్రమే కలిగి ఉన్నారని, ఒక శాతం కూడా లేరని, 18 సం వత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు క ల్పించేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆ దేశించారు. ముఖ్యంగా కళాశాలలు సందర్శించి ఓటర్ల నమోదుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాని కలెక్టర్ ఆదేశించారు.

కొల్లాపూర్ నియోజకవ ర్గ పరిధిలో ఒక మొబైల్ పోలింగ్ కేంద్రాన్ని ఏ ర్పాటు చేసి అందులో డెమో ఈవిఎంలను ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డిఓను ఆదేశించారు. అందుకు మున్సిపల్ వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో తొలగించిన 15 వేల 534 ఓటర్లలో 5201 మరణించిన ఓటర్లు కాగా 3511 ఇతర నియోజకవర్గానికి బదిలీ చేసుకున్న ఓటర్ల వివరాల జాబితాను మండలాల వారిగా కలెక్టర్ పరిశీలించారు.

100 సంవత్సరాలు దాటిన ఓటర్లను పరిశీలించారు. జులై 24 నుంచి ఆగష్టు 31 వరకు సవరణలు, పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 2 నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అక్టోబర్ తుదిలో ఓటర్ జాబితాను ఎన్నికల విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కొల్లాపూర్ ఆర్డిఓ హనుమాన్ నాయక్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి, చిన్నంబావి, పానుగల్, వీపనగండ్ల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News