Wednesday, January 8, 2025

ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఓట రు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి ధృవీకరిం చాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ ఆర్డిఓ కార్యాలయంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ తహసీల్దార్ ఓటరు జాబితాలో పిఎస్‌ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపి క్ కార్డుల జారీ, నూతన ఓటర్ల నమోదు, ట్రాన్స్ జెండర్ ఓటర్ల నమోదు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో సిమిలర్ ఎంట్రీ మొదటి దఫా కింద క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. నాగర్‌క ర్నూల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓ ట్ల జాబితా నుంచి తొలగించిన, తొలగించిన ఓట్ల కు సంబంధించి సంపూర్ణ సమాచారం తమ వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివ రాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ ని బంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉ న్నాయో లేదో ధృవీకరించాలని తహసిల్దార్‌లను ఆ దేశించారు.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలో 259 పోలింగ్ కేంద్రాలలో 5101 గృహ సము దాయాలలో 6 ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్న 44వేల 650 ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదే శించారు. నియోజకవర్గంలో 2 లక్షల 13 వేల 1 83 మంది ఓటర్లు ఉండగా అందులో లక్షా 7058 మంది పురుషులు, లక్షా 6122మంది మహిళా ఓ టర్లు ఉండగా కేవలం ముగ్గురు ట్రాన్స్ జెండర్లు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారని, నియోజక వర్గంలో చాలామంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని, సి డిపిఓల ద్వారా ట్రాన్స్ జెండర్ల ఓట్ల నమోదుకు సి డిపిఓల సహకారం తీసుకుని ట్రాన్స్ జెండర్ల ఓట్ల శాతాన్ని పెంచాలని ఆదేశించారు.

అలాగే నియో జకవర్గ పరిధిలో 18,19 సంవత్సరాల వయస్సు గ ల యువ ఓటర్లు కేవలం 1676 మంది మాత్రమే కలిగి ఉన్నారని, ఒక శాతం కూడా లేరని, 18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా కళాశాలలు సందర్శించి ఓటర్ల నమోదుకు అవగాహన కార్యక్రమాలు చేప ట్టాని కలెక్టర్ ఆదేశించారు.

నాగర్‌కర్నూల్ నియో జకవర్గ పరిధిలో ఒక మొబైల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో డెమో ఈవిఎంలను ఏర్పా టు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా ప్రచా ర కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డిఓను ఆదే శించారు. అందుకు మున్సిపల్ వాహనాలను విని యోగించుకోవాలని ఆదేశించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలో తొలగించిన 5374 ఓటర్ల లో 336 మరణించిన ఓటర్లు కాగా 40 ఇతర నియోజకవర్గానికి బదిలీ చేసుకున్న ఓటర్ల వివరా ల జాబితాను మండలాల వారిగా కలెక్టర్ పరిశీలి ంచారు.

100 సంవత్సరాలు దాటిన ఓటర్లను పరి శీలించారు. జులై 24 నుంచి ఆగష్టు 31 వరకు స వరణలు, పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచుర ణ, సెప్టెంబర్ 2 నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అక్టోబర్ తుదిలో ఓటర్ జాబి తాను ఎన్నికల విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తె లిపారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఆర్డిఓ నాగలక్ష్మి, నాగర్‌కర్నూల్, తాడూరు, బిజినేపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట తహసీల్దార్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News