Friday, December 20, 2024

అభివృద్ధిపై సోషల్ మీడియాలో దుమ్మురేపండి

- Advertisement -
- Advertisement -

సెల్పీలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయాలి
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేశాం
జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర ఫొటోలు దిగి ప్రచారం చేయాలి
బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
బిజెపి ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలని బిఆర్‌ఎస్‌వి శ్రేణులకు పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో సెల్పీలు, రీల్స్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వి నాయకులు గెల్లు శ్రీనివాస్, ఇతర నాయకులు, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, విద్యార్థులంతా అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీలు దిగి ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో 1,001 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్‌దేనని, ఐఐటీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులతో ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని అన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉందని, బిఆర్‌ఎస్‌లో చేయబోయే అభివృద్ధిని సైతం ప్రజలకు తెలియజేయాలని కోరారు. సిఎం కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రస్థానం ఉందని, 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రం 30 శాతం అవార్డులు సాధిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కొనియాడారు. గత తొమ్మదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఊరూరా చర్చ చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి దగ్గర నల్లా పక్కన నిలబడి సెల్ఫీలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నర్సీరీ ఉన్న ఏకైక రాష్ట్రం మనదని కెటిఆర్ చెప్పారు.
తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కెటిఆర్ బిఆర్‌ఎస్‌వి శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాష్ట్రానికి సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే నియామకం చేస్తే.. బిఆర్‌ఎస్ గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. మరో 90 వేల ఉద్యోగాలు వివిధ ప్రక్రియలో ఉన్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేస్తామని.. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేస్తామని.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో 10 గంటలు కరెంట్ లేకపోయినా ప్రశ్నించలేదని.. ప్రస్తుతం 10 నిమిషాలు కరెంట్ లేకపోతే ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని అన్నారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర నిలబడి ఫొటోలు దిగి ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలో 2014లో పరిస్థితులు ఎలా ఉన్నాయని.. ప్రస్తుతం చాలా రంగాల్లో అభివృద్ధి చేశామని కెటిఆర్ వివరించారు. ఈ విషయాలను ప్రజలకు చేరవేయాలని విద్యార్థులను ఆదేశించారు. విద్యార్థులుగా కాకుండా తెలంగాణ ముద్దుబిడ్డలుగా అనుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. నోట్ల కట్టతో దొరికిపోయిన వ్యక్తే ఇవాళ కెసిఆర్‌ను అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమంటే హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా ద్వారానే బిజెపి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా ద్వారా బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నదని కెటిఆర్ మండిపడ్డారు. బిజెపి ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలని బిఆర్‌ఎస్‌వి శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది.. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. తాము బిసి మంత్రిత్వ శాఖ పెట్టమని అడిగితే కేంద్రం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం తీసేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బలోపేతం చేస్తుందని చెప్పారు.

BRSV 2

BRSV 3

BRSV 4

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News