- Advertisement -
- మంత్రి చామకూర మల్లారెడ్డి
శామీర్‌పేట: మహిళ అభివృద్ధితోనే కుటుంబ అభివృద్ధి చెందుతుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం శామీర్‌పేటలోని రెడ్డి భవన్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఎసి) వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. శామీర్‌పేట, ముడుచింతలపల్లి మండలాలకు చెందిన అర్హులైన సుమారు 90 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎల్లుబాయి బాబు, జడ్పిటిసి అనితలాలయ్య, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపిపి ఎల్ల సుజాత, రైతుబంధు సమితి అధ్యక్షుడు కమటం కృష్ణారెడ్డి, మూడుచింతలపల్లి సర్పంచ్ జాం రవి, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు సుదర్శన్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -