Monday, January 20, 2025

ఉద్యమ నేతల కృషితోనే పార్టీ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : కోదాడ నియోజకవర్గంలో మహిళా ప్రజా ప్రతినిధులకు పార్టీ నాయకులకు కనీస గౌరవం దక్కడం లేదని బిఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, రాష్ట్ర కా ర్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబులు అన్నారు. మంగళవారం మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి ఉద్యమ కాలంలో 80వేలకు పైగా సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన కోదాడ నియోజకవర్గంలో ఉద్యమ కారులకు కనీస గౌరవం దక్కడం లేదని, మహిళా ప్రజా ప్రతినిధులను వివిధ కార్యక్రమాలలో అవమానపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని, ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎ ంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, పార్టీలోని వివిధ కేడర్లో ఉన్న నాయకులు అందరి కృషితోనే వి జయం సాధించామని, గెలుపొందిన తరువాత గర్వంతో స్థానిక ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల పై, నాయకుల పై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధుల పై జరుగుతున్న పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, వివిధ మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు,గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News