Sunday, January 19, 2025

కెసిఆర్ కృషితోనే పట్టణాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

వైరా : సిఎం కెసిఆర్ కృషితోనే పట్టణాల అభివృద్ధి పరుగులు పెడుతుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. శుక్రవారం వైరాలో పట్టణ ప్రగతి మహోత్సవంలో భాగంగా వైరా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎన్‌విఎస్ గార్డెన్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.20 కోట్ల నిధులతో వైరా మున్సిపాలిటీలో మట్టి రోడ్లు లేకుండా సిసి రోడ్లు నిర్మించామన్నారు.

ప్రతి వార్డులో ఇప్పటికే డ్రైనేజి వ్యవస్థను మేరుగు పరిచామని, పరిసరాల పరిశుభ్రతకై మీని వ్యాన్‌లను ఏర్పాటు చేసి చెత్తను ఇంటి వద్ద సేకరించి పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. క్రీడాకారులను ప్రొత్సహించుటకు ఇం డోర్ స్టేడియంను నిర్మించామని, గిరిజన భవనం ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు చేపతున్నామన్నారు. అనంతరం కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన వారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, ఏయంసి చైర్మన్ రత్నం, కౌన్సిలర్లు డాక్టర్ దారెల్లి కోటయ్య, సూర్యదేవర వింధ్యరాణి, దారెళ్ళి పవిత్ర, కర్నాటి నందిని, లగడపాటి లక్ష్మీరాజ్యం, మరికంటి డేడి కుమారి, దిశా కమిటి సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, సూర్యదేవర శ్రీధర్, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, మచ్చా వెంకటేశ్వరరావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, రామాలయం దేవాలయ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News