Monday, January 20, 2025

గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

పర్వతగిరి: గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనమని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పర్వతగిరిలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనమని భావించి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతే లక్షంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో పేరుకపోయిన చెత్త, చెదారం, మురుగు కాలువలను శుభ్రపర్చడం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ డంపింగ్ యార్డుల్లో పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠ ధామాల నిర్మాణం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం తదితర కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పరిశుభ్రతతో అలరారుతున్నాయన్నారు.

అందువల్లనే నేడు తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గారమాలుగా మారుతున్నాయన్నారు. ప్రతీ పంచాయతీకి ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్‌తో చెత్త సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డుతోపాటు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం చేసినట్లు, వీటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామానికి రూ. 2.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ. 12.60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ. 116.52 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కల్పన, డీఆర్‌డీఓ సంపత్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News